మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల మధ్య ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రత్యేక ఆలంకరణలో మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి మహామంగళహారతులు గావించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది.


