ఆర్టీసీ బస్సులో దివ్యాంగ బాలుడికి జరిమానా | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో దివ్యాంగ బాలుడికి జరిమానా

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

మహిళా కండక్టర్‌పై కేసు నమోదు

తనిఖీ అధికారుల అత్యుత్సాహం

కర్నూలు సిటీ: మహిళలకు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం ఉన్నా తనిఖీ అధికారుల అత్యుత్సాహం చూపారు. దివ్యాంగ బాలుడికి జరిమానా జరిమానా వేయడంతోపాటు మహిళా కండక్టర్‌పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు డిపో–2కు చెందిన బస్సు శనివారం ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు వచ్చే సమయంలో కండక్టర్‌ టికెట్లు ఇస్తున్నారు. స్టేజ్‌ రాకముందే రీజినల్‌ ప్రొద్దుటూరు స్క్వాడ్‌ అధికారులు బస్సును నిలిపారు. స్టేజ్‌ రాలేదు, టికెట్లు ఇవ్వడం పూర్తికాలేదని తనిఖీ ఆఫీసర్లకు మహిళా కండక్టర్‌ చెప్పినా వినలేదు. తనిఖీలు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఐదేళ్ల దివ్యాంగ బాలుడు టికెట్‌ తీసుకోలేదని బాలుడి తల్లికి రూ.100 జరిమానా వేశారు. ఆ తరువాత కండక్టర్‌పై సైతం కేసు నమోదు చేశారు. దివ్యాంగ బాలుడికి జరిమానా విధించడపై ప్రయాణికులు నిలదీశారు. బే స్టేజ్‌ (స్టేజ్‌ రాకముందే)లో తనిఖీలు చేస్తూ కండక్లర్లపై కేసులు నమోదు చేస్తూ మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.రాజ్యలక్ష్మి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement