జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు...
అంగన్‌వాడీ కేంద్రాలు 1,886
44,627
కర్నూలు(అర్బన్): అధిక ఉష్ణోగ్రతలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్టకష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
చాలీచాలని గదులు
రాష్ట్రంలోని దాదాపు అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీ చాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అంగన్‌వాడీ టీచర్లకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఆర్థికంగా చితికి పోతున్న కేంద్రాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బియ్యం, కంది పప్పు, ఆయిల్ మినహా మిగిలిన సరుకులన్ని ( ఆకుకూరలు, కూరగాయలు, గ్యాస్ ) బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రూ.2 ఇస్తోంది. రెండు రూపాయలతో పౌష్టికాహారం పెట్టడం ఎలా సాధ్యమని అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉప్పు, చింతపండు, కారం, వెల్లుల్లి, ఆకుకూరలు తదితర వాటి ధరలన్ని పెరిగి పోయాయని వారంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లోనే పిల్లలను ఉంచుకోవాలని చెబుతున్న ప్రభుత్వం సాయంత్రం సమయాల్లో పిల్లలకు అందించే స్నాక్స్‌ను మరిచి పోయింది. మెనూ చార్జీలు పెంచాలని, పనిభారాన్ని తగ్గించాలని, వేతనాలను పెంచాలనే పలు డిమాండ్లతో ఇప్పటికే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వివిధ రూపాల్లో పోరాటాలను కొనసాగిస్తున్నారు.
తీవ్ర ఉక్కపోత ...
ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుంటే, వారిని సముదాయించలేక ఆయాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయం అంగన్‌వాడీ కేంద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇళ్లకు దూరంగా ఉన్న కేంద్రాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు వారు ఇబ్బంది పడుతున్నారు.
భోజనం చేస్తున్న చిన్నారులు
గర్భిణులు18,992
ఐసీడీఎస్
ప్రాజెక్టులు 09
బాలింతలు15,346
3–6 సంవత్సరాల
మధ్య వయస్సు చిన్నారులు
0–3 సంవత్సరాల
చిన్నారులు
అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు
ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
పక్క రాష్ట్రాల్లో ముందస్తు
చొరవ తీసుకున్న ప్రభుత్వాలు
జిల్లాలో ఉక్కపోతతో
అల్లాడిపోతున్న చిన్నారులు


