సెలవులు ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

సెలవులు ప్రకటించాలి

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

సెలవులు ప్రకటించాలి పక్క రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు

ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పెద్ద పిల్లలందరూ ఇళ్ల వద్ద ఉంటే చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం కూడా తగ్గిపోతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలి.

– బీ రేణుక, కోశాధికారి, అంగన్‌వాడీ వర్కర్స్‌

అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (సీఐటీయూ)

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేసవిలో కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

– జేలలితమ్మ, ఏపీ అంగన్‌వాడీ

వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయూసీ)

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భవతుల ఫీడింగ్‌కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వర్కర్లు, హెల్పర్లకు వేర్వేరుగా 15 రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

– పీ విజయ, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ

Advertisement
 
Advertisement
Advertisement