తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
● పెట్రోల్, డీజిల్ అందక వాహనదారుల ఇబ్బందులు
ఎమ్మిగనూరురూరల్/సెంట్రల్: పెట్రోల్, డీజిల్ అందకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంక్‌లు మూతపడగా, మరికొన్ని ఉన్నదాంట్లోనే వంతులవారీగా ఇస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమానులతో వాహనచోదకులు వాగ్వాదానికి దిగుతున్నారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో జీఎం, మంత్రాలయం రోడ్డులోని రిలయన్స్, ఎంజీ పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. దీంతో వాహనదారులందరూ శివ సర్కిల్‌లోని పెట్రోల్ బంక్, కర్నూలు రోడ్డులోని పెట్రోల్ బంక్ దగ్గరకు పరుగులు తీశారు. వాహనదారులను అదుపు చేయలేక పెట్రోల్ బంక్ నిర్వాహకులు కొద్దిసేపు పంిపిణీని నిలుపుదల చేశారు. ఎన్నిరోజులు ఈ కష్టాలని చంద్రబాబు ప్రభుత్వంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా డీజిల్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డీజిల్ దొరక్కపోవడంతో ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో మీద తెచ్చిన ఫైనాన్స్‌ను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పాలకులు చర్యలు తీసుకుని డీజిల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. – ఉరుకుందు, ఆటో డ్రైవర్, ఎమ్మిగనూరు


