గొప్ప మహనీయుడు భగీరథ మహర్షి | - | Sakshi
Sakshi News home page

గొప్ప మహనీయుడు భగీరథ మహర్షి

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

కోసిగి: గంగను భూమిపైకి తీసుకువచ్చిన భగీరథ మహర్షి గొప్ప మహనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలన్నారు. కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భగీరథ మహర్షి గొప్ప మహానీయుడని, ఆయన అడుగు జాడల్లో అందరూ నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీమోహన్‌ రెడ్డి, వైఎస్సా సీపీ డాక్టర్ల విభాగం జిల్లా నాయకుడు దశరథ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బెట్టన గౌడ, నాడుగేని నాగరాజు, బసిరెడ్డి, కాంట్రాక్టర్‌ నాగరాజు, గ్రామ ఉప్పర సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement