ఆధునిక కాలంలో చాలా మంది బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో అప్పట్లోలాగా ఇప్పుడు చద్దన్నం తయారు చేసుకుని తినే సమయం, ఓపిక ఇప్పటి వారికి లేదు. అందుకే ఇలాంటి వారి కోసం రెడీమేడ్‌గా చద్దన్నం అంది స్తున్నాయి హోటళ్లు. ఇటీవల కాలంలో కర్నూలు నగరంలో అవుట్ డోర్ స్టేడియం, వెంకటరమణ కాలపీ, బి.క్యాంపులోని సిల్వర్‌జూబ్లీ కాలేజి వద్ద ‘మన చద్దన్నం’ పేరుతో వరి అన్నంతో పాటు కొర్రలు, సామలు, అరికెలు, జొన్నలు, రాగులతో చద్దన్నం, పొంగలి తయారు చేసి మట్టిపాత్రలో వడ్డిస్తున్నారు. ఇందులో మునగాకు సూపు, మునగాకు చట్ని, వేరుశనగ, మిరియాలు, లవంగాలు, మిర్చి విత్తనాలతో కూడిన పౌడర్, ఉల్లి, క్యారెట్, బీట్‌రూట్ తురిమిన సలాడ్‌ను కలిపి ఇస్తున్నారు. దీంతో పాటు అవిశగింజెలు లడ్డు, డ్రైఫ్రూట్ లడ్డూలను తయారు చేసి ఇస్తున్నారు. ప్రతిచోటా రోజూ వంద మందికి పైగా ఈ చద్దన్నం తింటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి నల్గొండకు చెందిన ఓ వారు ప్రాంచైజీ రెండు రోజుల పాటు శిక్షణ, పరికరాలు ఇచ్చి వెళ్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వీరి చద్దన్నంకు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రజలు చిరునామా తెలుసుకుని వచ్చి తింటున్నారు.
నగరంలో చద్దన్నం పదార్థాల విక్రయశాల


