నేడు సీక్యాంప్‌ రైతుబజార్‌ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సీక్యాంప్‌ రైతుబజార్‌ బంద్‌

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

చైన్‌ స్నాచింగ్‌ దొంగల అరెస్ట్‌

కర్నూలు(అర్బన్‌): నగరంలోని సీ క్యాంప్‌ రైతు బజార్‌ను ఈ నెల 24వ తేదీన ( శుక్రవారం ) బంద్‌ చేస్తున్నట్లు ఎస్టేట్‌ ఆఫీసర్‌ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలలో ఒక రోజు రైతు బజార్‌ను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నందున ఈ బంద్‌ను నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పనులు చేపడుతున్న దృష్ట్యా ఎలాంటి వ్యాపారాలు జరగబోవన్నారు. యథాతథంగా శనివారం రైతు బజార్‌ పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు.

ఇద్దరు విద్యార్థులకు ‘షైనింగ్‌’ అవార్డులు

కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్‌ డా.ఎన్‌.బి లోకరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు కేజీబీవీల్లో చదివిన షేక్‌ ఆఫ్రీన్‌ ఒకేషనల్‌ గ్రూప్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో 990 మార్కులు సాధించారని, పంచలింగాల కేజీబీవీకి చెందిన గుడిసె చందన ఒకేషనల్‌ గ్రూప్‌ అకౌంటెన్సీ–టాక్సేషన్లో 987 మార్కులు సాధించారని పేర్కొన్నారు. వీరిద్దరూ షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపికయ్యారన్నారు.

కోవెలకుంట్ల: గతేడాది ఆగస్టు నెలలో జరిగిన చైన్‌స్నాచింగ్‌ కేసులో దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోవెలకుంట్ల పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం సీఐ హనుమంతునాయక్‌ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సత్యసాయిబాబా ఆలయ సమీపంలో నివా సం ఉంటున్న లక్ష్మీకుమారి గతేడాది ఆగస్టు 24వ తేదీన ఇంటి పక్కన మహిళలతో వాకింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో మహిళల వద్దకు గుర్తు తెలియని 35 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి వారి వెనుకనే వాకింగ్‌ చేస్తున్నట్లు నటించి వారిని దాటే వెళ్లే సమయంలో లక్ష్మికుమారి మెడలో ఉన్న నల్లపూసలదండ, బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తాడు. కొంతదూరంలో మరో వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉండగా ఆ బైక్‌ ఎక్కి ఇద్దరు అక్కడి నుంచి గుంజలపాడు గ్రామం వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని చేధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షేక్‌ తహలిబ్‌ ఉసేన్‌, షేక్‌ దిల్వర్‌ చోరికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్‌ చే సి నల్లపూసలదండ, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దొంగలను కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement