● పంచలింగాల చెక్‌పోస్టులో తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్
కర్నూలు: జిల్లాలోకి పొరుగు రాష్ట్రాల మద్యం కాకుండా నిరంతరం తనిఖీలు చేస్తూ కట్టడి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. గురువారం కర్నూలు శివారు హైదరాబాదు రోడ్డులో ఉన్న పంచలింగాల ఎకై ్సజ్ చెక్‌పోస్టును జిల్లా అధికారి సుధీర్ బాబుతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌ఐ ఐదుగురు సిబ్బంది రెండు షిఫ్టులలో విధులు నిర్వహిస్తుంటారు. అక్కడున్న రికార్డులను డిప్యూటీ కమిషనర్ తనిఖీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్పిరిట్ ట్యాంకర్లు జిల్లాలోకి వస్తే ఖచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని, అలాగే అనుమానిత వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. షిఫ్ట్ విధానంలో అప్రమత్తంగా ఉంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి అక్రమ రవాణాపై కూడా గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, తదితరులు కూడా డీసీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని అనుమానిత వాహనాలను కూడా తనిఖీ చేశారు.
లా సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సుల 3, 5, 7, 9 సెమిస్టర్, డిగ్రీ 6వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.


