చద్దన్నం హోటల్‌ను నేను గత ఫిబ్రవరిలో ప్రారంభించాను. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చద్దన్నం పదార్థాలను విక్రయిస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరుసటి రోజుకు కావాల్సిన చద్దన్నం తయారీకి సిద్ధమవుతాం. ఉదయం పొంగలి తయారు చేసుకుని రెడీమేడ్‌గా ప్రజలకు అందిస్తున్నాం. చద్దన్నంకు ప్రజల నుంచి ఆదరణ బాగుంది. – నారాయణమ్మ, చద్దన్నం హోటల్
నిర్వాహకురాలు, కర్నూలు
నేను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. రెండు వారాలుగా నాకు, నా భార్యకు చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాను.
ఇందులో ముఖ్యంగా అరికెలు, సామలతో చేసిన పదార్థాలు, కారాలు తీసుకుంటున్నాను. నేను రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఆరోగ్య రీత్యా చద్దన్నం రుచులు
ఎంతో బాగుంటాయి.
–జి. శ్రీరాములు, ప్రైవేటు ఉద్యోగి, కర్నూలు
నేను రెండు నెలల క్రితం చద్దన్నం హోటల్‌ను ప్రారంభించాను. మా వద్ద వరి చద్దన్నంతో పాటు రాగులు, జొన్నలు, అరికెలు, కొర్రలతో చేసిన చద్దన్నాలు, కినోవా, రెడ్‌రైస్, సామలు, కొర్రలతో చేసిన పొంగలి తయారు చేస్తున్నాం. వీటికితోడుగా మునగాకు, కరివేపాక చట్ని, సూప్‌లు, ఉల్లి,క్యారెట్, బీట్‌రూట్‌లతో తురిమిన మిక్స్, ఆయుర్వేదిక్ కారం పొడి, మజ్జిగ అందిస్తున్నాం. రోజుకు వంద మందికిపైగా వస్తున్నారు. – బాల లక్ష్మి, చద్దన్నం
హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు
మేము కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉంటున్నాం. రెండు వారాలుగా చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాం. ఒక్కోరోజు ఒక్కో పదార్థాన్ని మధ్యాహ్న భోజనంగా పార్శిల్ తీసుకుంటున్నారు. ఒక పార్శిల్ ఒకరికి సరిపోతుంది. నూనె, మసాలాలు ఉండవు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. వేసవిలో ఇలాంటి ఆహారం ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి.
– రామకృష్ణ,
లెక్చరర్, కర్నూలు


