రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

చిప్పగిరి: హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డిని విధుల నుంచి డిస్మిస్‌ చేయడం ప్రభుత్వ ‘రెడ్‌బుక్‌’ అరాచక పాలనకు నిదర్శమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులు మృతిచెందారన్నారు. హక్కులు అడిగే వారిని అణచి వేసే ధోరణిలో కాకుండా వారి సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు. తక్షణమే డిస్మిస్‌ చేసిన కాకర్ల వెంకట్రామి రెడ్డిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement