కాలేయానికి కష్టం! | - | Sakshi
Sakshi News home page

కాలేయానికి కష్టం!

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

ఆరేళ్లలో పెద్దాసుపత్రిలో కాలేయ బాధితులు

బాధితులు మరణాలు

జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యం

కాలేయ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది కలిగినా అవి మనకు హెచ్చరిక చేస్తాయి. కానీ కాలేయం మాత్రం తనకు ఎంత ఇబ్బంది కలిగినా ఓర్పు, సహనంతో పనిచేసుకుంటూ పోతుంది. ఇదే మనుషుల పాలిట శాపంగా మారుతోంది. పసిరికలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించే సమయానికి కాలేయానికి గణనీయమైన నష్టం జరిగి ఉంటోంది. ఈ కారణంగానే ఈ అవయవాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం (జీర్ణకోశవ్యాధుల విభాగం)లో ప్రతిరోజూ ఓపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ విభాగానికి రోగు ల తాకిడి అధికమైంది. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇందులో జీవనశైలి సమస్యలు,ఆహారం విషతుల్యం కావడం,ఇన్‌ఫెక్షన్లు, మద్యపానం తదితర కారణాల తో కాలేయం దెబ్బతిని చికిత్స కోసం వచ్చే వారు అధికమవుతున్నారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్ల వద్దకు ప్రతిరోజూ 1,500 మంది దాకా వివిధ రకాల జీర్ణకోశ వ్యాధుల తో వస్తుండగా అందులో పావు భాగం మద్యపానం కారణంగా కాలేయ సమస్యలకు గురైన వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం, హెపటైటిస్‌–బి,సి వైరస్‌ వంటి ఇన్‌ఫెక్షన్ల కారణంగా కాలేయం దెబ్బతింటోంది.

కొంపముంచుతున్న మద్యపానం

సరదాగా స్నేహితులతో ప్రారంభమయ్యే మద్యపా నం అలవాటు కొన్నాళ్లకు వ్యసనమై కాలేయానికి పెనుముప్పుగా మారుతోంది.వ్యసనపరులకు ప్రతి రోజూ మద్యం ముట్టనిదే రోజు గడవని పరిస్థితి ఉంటోంది.ఈ కారణంగా శరీరంలో ముందుగా కాలేయం,దాంతో పాటు గుండె,రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. కొందరిలో బీపీ,షుగర్‌ వ్యాధులూ వస్తున్నాయి. కాలేయ సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్న వారిలో 25 శా తం మద్యపానం వల్లేనని నిర్ధారణ అవుతోంది. ప్ర భు త్వం నాణ్యమైన మద్యం పేరుతో దుకాణాలు పెంచి విచ్చలవిడిగా సరఫరా చేస్తోంది. వ్యసనపరులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం తాగి ఒళ్లుగుల్ల చేసుకుంటూ కాలేయ వ్యాధుల భారిన పడుతున్నారు.

కాలేయ వ్యాధి లక్షణాలు

కాలేయ సమస్యలతో బాధపడే వారిలో కాళ్లు, చీలమండలాల్లో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపునొప్పి, మూ త్రం రంగులో మార్పు, పొట్టుచుట్టూ దురద, ఎరు పు చర్మం, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవ్వరిలోనైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే నయం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరాక తీసుకుంటే ఫలితం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంవత్సరం ఓపీడీ ఎండోస్కోపిలు కాలేయ సమస్యల మద్యపానంతో

2021 12,131 3,024 940 13

2022 14,065 3,700 1,062 36

2023 14,837 5,965 1,303 41

2024 17,578 6,104 1,450 61

2025 18,612 7,115 1,518 65

2026 5,790 1,824 495 19

(ఇప్పటివరకు)

కాలేయ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెద్దాసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగంలో ఇటీవల పెరిగింది. చికిత్స కోసం వచ్చే వారికి అవసరమైన వైద్యపరీక్షలు, మందులు, చికిత్స ఉచితంగా అందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెపటైటిస్‌–బి,సి వ్యాధులతో బాధపడే వారికి ఖరీదైన మందులను ఉచితంగా ఇస్తున్నాము. కాలేయం దెబ్బతినకుండా ఉండాలంటే మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.

– డాక్టర్‌ జి.మోహన్‌రెడ్డి, హెచ్‌ఓడీ, గ్యాస్ట్రో

ఎంట్రాలజి విభాగం, జీజీహెచ్‌, కర్నూలు

గత రెండు దశాబ్దాల్లో కాలేయ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ల్యాపరోస్కోపిక్‌ సర్జరీల ద్వారా చిన్నకోతలతో ట్యూమర్లు తొలగించడం, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకోవడం సాధ్యమవుతోంది. దేశంలో లివర్‌ డోనర్‌ కొరత ఉన్న నేపథ్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎంతో కీలకంగా మారింది.

–డాక్టర్‌ ఎస్‌.జె.జానకిరామ్‌,

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు

ప్రమాదంలో ప్రధాన అవయవం

ఒకవైపు ఫ్యాటీ లివర్‌,

మరోవైపు హెపటైటిస్‌ వేధింపు

మద్యపానమే అసలు సమస్య

జిల్లాలో పెరుగుతున్న

కాలేయ బాధితులు

Advertisement
 
Advertisement
Advertisement