ఆసుపత్రిలో మాయమై ... శ్మశానంలో ఖననమై | - | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో మాయమై ... శ్మశానంలో ఖననమై

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

ఆత్మకూరురూరల్‌: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆపై కనిపించకుండా పోయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా.. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి చెందిన సుగులూరి శేఖర్‌(47)అనారోగ్యంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఈనెల 13 వ తేదీన చేరారు. ఆయన భార్య జయమ్మ మందులు తీసుకు రావడానికి బయటకు వెళ్లివచ్చిలోపు శేఖర్‌ కనిపించ లేదు. ఎంత వెతికినా ఆయన ఆచూకీ చిక్కక పోవడంతో జయమ్మ స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 18 న పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు శేఖర్‌ ఫొటోతో కరపత్రాలు ముద్రించి గోడలకు అతికించా రు. స్థానిక శ్మశాన వాటికలో పనిచేసే ఓ వ్యక్తి ఆ ఫొటోను చూసి తమ వద్దకు అనాథ శవంగా రాగా అంత్యక్రియలు చేసినట్లు శేఖర్‌ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో బుధవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే ఎలా చనిపోయాడో తెలుస్తుందని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement