కర్నూలు : నగర శివారులోని పెద్దపాడులో ఉన్న దామోదరం సంజీవయ్య బాలసదన్ హాస్టల్‌ను న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్ లోని అపరిశుభ్ర పరిస్థితులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజన వస తి సదుపాయాల గురించి విచారించగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, గుడ్లు అందరికీ సరఫరా చేయడం లేదని విద్యార్థులు జడ్జికి విన్నవించారు. దీంతో అక్కడి సిబ్బందిపై లీలా వెంకటశేషాద్రి ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లలకు సరైన సమయంలో నాణ్యమైన భోజనం, అందరికీ గుడ్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.


