● బీసీ గళం పోస్టర్ల ఆవిష్కరణలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి
నంద్యాల: బీసీలకు ఎన్నికల సమయంలో కూటమి సర్కారు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ హోటల్‌లో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్‌సీపీ బీసీ గళం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ బీసీలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు ఈనెల 26వ తేదీ అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దారా సుధీర్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి, నాయకులు సూర్యనారాయణరెడ్డి, దాల్‌మిల్ అమీర్‌బాషా, శిల్పాభువనేశ్వరరెడ్డి, సాయిరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


