రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

సి.బెళగల్‌: బైక్‌ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని గుండ్రేవుల గ్రామానికి చెందిన కొంకల సోమిరెడ్డి (29) పనిమీద కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో పరిచయస్తులైన తెలుగు వీరేష్‌, తెలుగు రాఘవేంద్రతో కలిసి బైక్‌పై మంగళవారం రాత్రి బయలుదేరాడు. ఇనగండ్ల గ్రామ సమీపంలో గాలితో కూడిన వర్షానికి తోడు ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్‌కు దారి కనిపించకపోవడంతో బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న వాహన దారులు గాయపడిన వారిని గుర్తించి, వారి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొంకల సోమిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలుగు వీరేష్‌, తెలుగు రాఘవేంద్ర పరిస్థితి సైతం విషమంగా ఉంది. సోమిరెడ్డికి భార్య తులసి, పది నెలల కుమారుడు ఉన్నాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు తెలిపారు.

మరో ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement