గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును మంగళవారం ఉదయం మైనింగ్ అధికారులు పరిశీలించారు. వారం రోజులుగా గంజిహళ్లి చెరువు మట్టిని ఇటుకల బట్టి వ్యాపారులు టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గంజిహళ్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మైనింగ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ రంగడు గంజిహళ్లి చెరువును పరిశీలించారు. కొందరు వ్యక్తులు రైతుల పేరుపై తీసుకున్న అనుమతులను రద్దు చేసినట్లు ఏఈ తెలిపారు. రైతులు తమ పంట పొలాలకు చెరువు మట్టిని వేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. ఆయన వెంట గ్రామస్తులు మహేష్ రెడ్డి, తోలు రాముడు, గంజిల్లయ్య, మల్లేష్, చిన్న సవారి తదితరులు ఉన్నారు.
తుగ్గలి: త్వరలో ప్రారంభం కానున్న జొన్నగిరి సమీపంలోని జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) గోల్డ్ మైనింగ్ ప్లాంట్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సందర్శించారు. రూ.200 కోట్లతో నూతనంగా చేపట్టిన ప్లాంట్‌లో బంగా రం ఉత్పత్తి అయ్యే చివరి దశ, ఇతర విభాగాలను పరిశీలించారు. బంగారం ఎంత ఉత్పత్తి అవుతుంది, దాన్ని వెలికితీసే ఖర్చు, ఎంత మంది కార్మి కులు పనిచేస్తున్నారు, వారి భద్రతపై తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలపై ఆమె ఆరా తీశారు. అనంతరం ఏపీఐఐసీ జెడ్‌ఎం, జియో మైసూర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తహసీల్దార్ రవిని ఆదేశించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఇన్‌చార్జ్ ఆర్డీవో మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్ ఉన్నారు.
రేపు భగీరథ మహర్షి జయంతి
కర్నూలు(అర్బన్): ఈ నెల 23వ తేదీన శ్రీ భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల ను కర్నూలులో నిర్వహించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు స్థానిక సునయన ఆడిటోరియంలో ఉదయం 11 గంటల కు జయంతి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆర్ వెంకటరమణప్ప అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి సవిత హాజరవుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపామన్నారు.
రుద్రమూర్తికి విశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోకకల్యాణం కోసం ఆలయ ఈశాన్య భాగంలో రుద్రవనంలోని రుద్రమూర్తికి మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత రుద్రమూర్తికి అభిషేకం జరిపించారు. అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలు, గందోధకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతో, ఆ తరువాత జలంతోనూ అభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రదేవునికి బిల్వార్చన, పుష్పార్చన జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరిదాసు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


