వాహనాలన్నీ పెట్రోల్‌ బంకుల వైపు | - | Sakshi
Sakshi News home page

వాహనాలన్నీ పెట్రోల్‌ బంకుల వైపు

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూలో వాహనాలు

ఎమ్మిగనూరురూరల్‌: డిమాండ్‌కు తగ్గట్లుగా ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయలేక పోతున్నాయి. దీంతో పలు పెట్రోల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలో గత రెండురోజులుగా ఈ సమస్య మరీ తీవ్రమైంది. స్టాక్‌ లేక పలు పెట్రోల్‌ బంకులు మూసేయగా ఒకటి రెండు బంకుల్లో కొద్ది పాటి నిల్వలున్నాయి. అక్కడికి వెళితే వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి నిరీక్షిస్తే లీటర్‌ పెట్రోల్‌ మాత్రమే వేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టాక్‌ లేదని పెట్రోల్‌బంకుల నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement