మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో ధరల ఉల్లంఘన, కల్తీ నివారణ కోసం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎకై ్సజ్‌ సీఐ చంద్రహాస్‌ స్టేషన్‌ సిబ్బందితో పాటు ఈఎస్‌టీఎఫ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందితో కలసి బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐలు దుర్గా నవీన్‌ బాబు, రెహనా బేగం తదితరులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 51 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. రెండు రోజులుగా 21 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలు టౌన్‌తో పాటు ఓర్వకల్లు, కర్నూలు రూరల్‌ మండలాలు ఈ స్టేషన్‌ పరిధి కిందికి వస్తాయి. సీఐ చంద్రహాస్‌ నేతృత్వంలో ప్రతి మద్యం దుకాణంలో తనిఖీలతో పాటు మద్యం బాటిళ్లను సురక్ష యాప్‌ ద్వారా స్కాన్‌ చేసిన తర్వాతనే వినియోగదారుడికి విక్రయించాలని సూచించారు. సేకరించిన మద్యంలో కల్తీ జరిగినట్లు పరీక్షల్లో తేలితే చర్యలు తప్పవని దుకాణ యజమానులకు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement