మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రులకు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభం కాగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించారు. వేడుక ప్రత్యేకతగా మూల బృందావనాన్ని గంధ లేపనంతో విశేషాలంకరణ చేశారు. పీఠాధిపతి చేతుల మీదుగా మహా మంగళహారతి కానిచ్చారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ, మూల సంస్థాన పూజలో భాగంగా మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. మూల బృందావన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


