క్వింటం వేరుశనగ రూ.7,394 | - | Sakshi
Sakshi News home page

క్వింటం వేరుశనగ రూ.7,394

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 1,212 క్వింటాళ్లు వచ్చాయి. క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,394 ధర పలికింది, కనిష్ట ధర రూ.3,860,మధ్యస్థ ధర క్వింటం రూ.5,627 పలికినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు 67 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,010, మధ్యస్థ ధర క్వింటం రూ.5,709, గరిష్ట ధర రూ.5,890, అదేవిధంగా మొక్కజొన్న 25 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం కనిష్ట ధర రూ.1,410, మధ్యస్థ ధర రూ.1,455, గరిష్ట ధర రూ.1,480కు, కందులు కేవలం 5 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర రూ.6,170, మధ్యస్థ ధర రూ.6,190, గరిష్ట ధర రూ.6,212లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement