మల్లన్న సేవలో గోవా మంత్రి | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో గోవా మంత్రి

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గోవా ప్రభుత్వ పవర్‌, న్యూ రెన్యువబుల్‌ ఎనర్జీ మంత్రి ఆర్‌.ఎం.దవళికర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన గోవా మంత్రి దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గోవా మంత్రి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను అందించి సత్కరించారు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి దంపతులు కూడా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement