మత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న ప్రభుత్వం

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

ఆలూరు: టీడీపీ పాలనలో, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్‌ పర్యవేక్షిస్తున్న పాఠశాలల్లో విద్యార్థులు మ త్తుకు బానిసలవుతున్నారని, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని ఆలూ రు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరికెర గ్రామంలోని అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులను పస్తులు ఉంచకుండా ఉపాధ్యాయులే స్వయంగా వంట వండిపెట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి శనివారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యా రు. ఉపాధ్యాయులు వర్గాలుగా విడిపోవడం, ఓ ఉపాధ్యాయులు కొందరు విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసలను చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత శాఖను సవ్యంగా పర్యవేక్షించలేని మంత్రి లోకేష్‌ ఆ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నా అధికార యంత్రాంగం నిద్ర మత్తులో జోగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందన్నారు. ఇదిలాఉంటే మొత్తం వ్యవహారంపై నివేదిక పంపాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement