వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

కర్నూలు (టౌన్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలువురికి పదవులు దక్కాయి. ఆదోనికి చెందిన కె. షౌకత్‌ తబ్రేజ్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధిగా నియమించారు.ఆ లూరుకు చెందిన రామిరెడ్డిని పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా, గుడమరెల్ల సుధాకర్‌ను ఆలూరు నియోజకవర్గం బూత్‌ కమిటీ విభాగం అధ్యక్షులుగా నియమించారు. ఆదోనికి చెందిన ఉప్పర నారాయణకు ఆదోని మున్సిపల్‌ విబాగం ఉపాద్యక్షులుగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తే కఠిన చర్యలు

కర్నూలు(సెంట్రల్‌): ప్రభుత్వ, వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములను అనధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ, వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూముల రిజిస్ట్రేషన్లపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఆదాయాభివృద్ధిలో వెనుకబడిన కోడుమూరు, కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ బజారి, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

జిల్లాలో గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది

వార్డుల వారీగా ఓటరు జాబితా

ప్రచురణ పూర్తి

కర్నూలు(అర్బన్‌): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రచురించడం పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాలు, 484 గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఓటరు జాబి తా ఆధారంగా ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఓటరు జాబితా పబ్లికేషన్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది ఉండగా, వీరిలో పురుషులు 6,21,834 మంది, మహిళా ఓటర్లు 6,29,614 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 123 మంది ఉన్నారన్నారు. అత్యధికంగా కర్నూలు మండలంలోనే పురుష ఓటర్లు 38,566 ఉండగా, మహిళా ఓటర్లు 39,001 మంది ఉన్నారన్నారు. అత్యల్పంగా గూడురు మండలంలో పురుష ఓటర్లు 9898 కాగా, మహిళా ఓటర్లు 9971 మంది ఉన్నారని డీపీఓ వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 7,780 మంది అధికంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement