కోడుమూరు రూరల్: కోడుమూరు మండలం బైన్‌దొడ్డి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు కురువ ఈరన్న, పద్మావతిలు ఉన్న ఊర్లో పనులు లేక హైదరాబాద్‌కు వలసవెళ్లి అక్కడే భవన నిర్మాణ కార్మి కులుగా పనులు చేస్తున్నారు. అయితే తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదన్న ఉద్దేశంతో తండ్రి ఈరన్న తమ కుమార్తె ఇంద్రజను కోడుమూరు కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థిని ఇంద్రజ ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 455 మార్కులకు 450 మార్కులు సాధించి సత్తా చాటింది. భవిష్యత్‌లో డాక్టర్ కావాలన్నదే తన కల అని, అందుకోసం కష్టించి చదువుకుంటానని విద్యార్థిని ఇంద్రజ తెలిపారు.


