అమ్మ కష్టాన్ని చూసి చదివా | - | Sakshi
Sakshi News home page

అమ్మ కష్టాన్ని చూసి చదివా

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

అమ్మ కష్టాన్ని చూసి చదివా డాక్టర్‌ కావాలన్నదే లక్ష్యం

మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్‌ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్‌ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను. – అన్నపురెడ్డి మరియమ్మ,

నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా

మా స్వస్థలం గూడూరు. మా అమ్మ, నాన్న పైగేరి అరుణమ్మ, బి.భాస్కర్‌కు నేను ఏకై క కూతురుని. నాన్న పదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో బైపీసీలో చేరి 460 మార్కులకుగాను 452 సాధించాను. డాక్టర్‌ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నా.

– బెక్కెం సౌమ్య భారతి, ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి

Advertisement
 
Advertisement
Advertisement