సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అవ్వడమే లక్ష్యం. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నా. ఇంటర్ ఫస్టియర్‌లో 470 మార్కులకు 459 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం మరింత బాగా చదివి మంచి మార్కులు సాధిస్తాను. జేఈఈ, ఏపీఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వారితోపాటు చదువు చెప్పిన గురువులకు కూడా నా వందనాలు.
– మాదినేని లహరి, ఇంటర్ ఫస్టియర్, కర్నూలు
మాది మధ్యతరగతి కుటుంబం. కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం స్వస్థలం. మా నాన్న నన్నూరి రుద్రన్న ఓ చిరుద్యోగిగా పని చేస్తూ నన్ను, మా అన్నను చదివిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి అన్న ఉద్యోగం చేస్తున్నా రు. మా నాన్న ఐఏఎస్ సాధించాలనుకున్నా...ఆర్థిక ఇబ్బందులతో ఆ వైపుగా వెళ్లలేకపోయారు. నాకు ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 989 మార్కులు వచ్చాయి. నాన్న కలను సాధించేందుకు ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నాను. – నన్నూరి హాసిని,
కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం


