నందికొట్కూరు: పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద అశ్రితాశ్రమం, పల్లె ప్రియాంక సేవా సమితి వృద్ధుల ఆశ్రమాన్ని హైకోర్టు జడ్జి ఎన్. హరినాథ్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాశ్రమం సందర్శించడంతో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడంతో రోగాల దూరమవుతాయన్నారు. ఈయన వెంట నందికొట్కూరు సివిల్ జడ్జి శోభారాణి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, శివరాముడు, శోభారాణి, మండ్లెం రామిరెడ్డి, సురేష్, లక్ష్మీనారాయణ, జార్జి, తదితరులు పాల్గొన్నారు.


