కర్నూలు(అర్బన్): ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్‌గుప్తా అన్నారు. విశ్వ మేధావి అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్‌ఖమర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహించారు. సాంఘీక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దక్కాలని కృషి చేశారన్నారు.
డీవీఎంసీ సభ్యుల నిరస
ఇదిలాఉంటే వేదికపై సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, కేవలం తమను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారే తప్ప కూర్చునేందుకు సీట్లు ఉండటం లేదని డీవీఎంసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. డీవీఎంసీ సభ్యులు మాలతీ, సురేష్‌గౌడ్, సురేంద్ర, యోగేష్‌నాయక్ తదితరులు వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మాజీ మంత్రి మారెప్ప, మాజీ మేయర్ బంగి అనంతయ్య, గోన నాగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నాగమణి, పోతురాజు రవికుమార్, వివిధ సంఘాల నాయకులు రెడ్డిపోగు రాజ్‌కుమార్, సోమసుందరం, కాసారపు వెంకటేశ్వర్లు, రాగిరి చంద్రప్ప, కై లాస్‌నాయక్ పాల్గొన్నారు.


