ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

హొళగుంద: వారాల తరబడి మంచినీళ్లు ఇవ్వకుండా అధికారులు ఏం చేస్తున్నారని ఖాళీ బిందెలతో మహిళలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 15 రోజులుకుపైగా హొళగుందలోని 8వ వార్డు పింజరిగేరికి మంచినీరే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా అక్కడికెళ్లి అధికారులను నిలదీశారు. తమ కాలనీకి మంచినీరు రాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాదనకు దిగారు. సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ విజయలలిత చెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement