ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 112 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 112 ఫిర్యాదులు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా క్రెడిట్‌ కార్డు మోసం, ఉద్యోగాల పేరుతో మోసం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తులు రాయించుకుని పిల్లలు తమ పోషణ పట్టించుకోవడం లేదని వృద్ధులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, రామయ్య నాయుడు, శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement