కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెలుతుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్ధీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవా రం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై గొర్రెలు ఎదురయ్యా యి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యు లు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు.
గాయపడిన ఖాజా మోహిద్దీన్, షహీన్ షా


