కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉదయం 90.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్‌నాయుడు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. సోమవారం వర్సిటీ వీసీ వెంకట బసవరావు, కమిటీ సభ్యులు భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు.
నల్లమలలో కారు బోల్తా
మహానంది: నల్లమలలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మద్యం వ్యసనం మానుకునేందుకు పాణ్యం వద్ద పసురు, అంత్రాలు వేస్తున్నారని తెలుసుకుని గుంటూరు పట్టణానికి చెందిన ముగ్గురు కారులో బయలుదేరి వచ్చారు. వచ్చిన పని చూసుకొని నంద్యాల, గాజులపల్లె మీదుగా తిరిగి వెళ్తున్నారు. గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


