దూసుకొచ్చిన కారు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన కారు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

● ఒకరికి తీవ్ర గాయాలు

పత్తికొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అదుపు తప్పి బంకు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కెఎ 05ఎఎన్‌ 7939 నంబరు గల కారు పత్తికొండ పట్టణానికి సమీపంలో మలుపు దగ్గర అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బంకు పైకి దూసుకెళ్లింది. దీంతో బంకులో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పక్కన నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వసం అయ్యాయి. అలాగే పెండ్లిమాన్‌తండాకు చెందిన రేక్యనాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అర్బన్‌ సీఐ జయన్నకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బంకు యాజమాని లక్ష్మణస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement