విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

ఓర్వకల్లు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని హుసేనాపురం మంగళవారం చోటుచేసుకొంది. వివరాలు.. గ్రామంలో కర్నూలు– కడప జాతీయ రహదారి పక్కన గల ఓ హో టల్‌ యజమాని వద్ద ఇనుప నిచ్చెనను కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో విద్యు త్‌ మరమ్మతుల నిమిత్తం తీసుకెళ్లారు. పని ముగించుకొన్న తర్వాత నిచ్చెనను హోటల్‌ యజమానికి అప్పగించేందుకు గ్రామానికి చెందిన దాసరి మహే ష్‌ (33) ఆటోలో ఎత్తి పంపారు. హోటల్‌ వద్ద నిచ్చెనను దించే సమయంలో విద్యుత్‌ తీగలకు తగలడంతో మహేష్‌ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయా డు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మీనాక్షితో పాటు, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement