సీఎంకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు | - | Sakshi
Sakshi News home page

సీఎంకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

మాది వెల్దుర్తి మండలం నార్లాపురం. మా తండ్రి పుల్లయ్య, వెంకట రంగమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు సంతానం. మాకు వారసత్వంగా 33 ఎకరాల పొలం ఉంది. ఒక్కొక్కరికి 5.5 ఎకరాలు వస్తుంది. అయితే 2009 వరకు మా తల్లి కురుపాటి వెంకట రంగమ్మ పేరిట 9 ఎకరాలు, నా పేరిట 5 ఎకరాల పొలం ఉండేది. 2009లో మా అమ్మ చనిపోవడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నా పేరిట ఉన్న 5 ఎకరాలు, మా అమ్మ పేరిట ఉన్న 9 ఎకరాలను తొలగించి మా నలుగురు అన్నదమ్ముల పేరిట మ్యుటేషన్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి నా భాగం కోసం కలెక్టరేట్‌, వెల్దుర్తి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం, సీసీఎల్‌ఏ కమిషనర్‌కు అమరావతికి వెళ్లి ఫిర్యాదు అందజేశాం. కర్నూలు ఆర్‌డీఓ కనీసం బాధితులకు ఆర్‌ఓఆర్‌ కేసు కింద నోటీసులు కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారి లేరు. దిక్కుతోచని స్థితిలో ఉన్నా. – కురుపాటి పుల్లయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement