● చంద్రబాబు కోసం మహిళలనుకించపరిచిన వ్యక్తిని క్షమించం ● మావిగన్‌కు వస్తున్న స్పందన జీర్ణించుకోలేకపచ్చమీడియా కారుకూతలు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: మావిగన్‌కు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కడుపుమంటతోనే ఏబీఎన్ రాధాకృష్ణ చెత్త పలుకులు పలికారని ఆలూరు ఎమ్మె ల్యే విరూపాక్షి విమర్శించారు. సభ్యసమాజం తలదించేకునేలా ఏబీఎన్‌లో రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నాయకులపై రాసిన రాతలను ఆయన తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రమైన చిప్పగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం చంద్రబాబును మోసేందుకు, ఆయన మొప్పుకోసం జర్నలిజం ముసుగులో ఏబీఎన్ ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంటే ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు తన పచ్చమీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబును మోసేందుకు మహిళలను కించపరిచిన వ్యక్తిని క్షమించమని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులోని ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల పై పోలీసుల దాడికి యత్నించడం వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వైఎస్సార్‌సీపీ నేతలపై అసభ్యకర రాతలు రాసిన రాధాకృష్ణను క్షమించేది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో భూ కబ్జాలకు పాల్పడతూ.. వేల కోట్లు దోచుకుంటున్నారని చెప్పారు. ప్రజలు, అమరావతి రైతుల దృష్టిని మళ్లించేందుకే తన అనుకూల మీడియాలో పిచ్చిరాతలు రాయిస్తున్నారన్నారు.


