● మాట్లాడుతున్న ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు(టౌన్): రాధాకృష్ణ ఒక పేపర్‌కు అధినేతగా కాకుండా చంద్రబాబుకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నాడని, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త పలుకు పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల భార్యలను కించపరిచే విధంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. జర్నలిస్టు ముసుగులో సమాజానికి మీ వల్ల ఏం ఉపయోగమో తేలీదు కానీ, చంద్రబాబు ఇంట్లో పనిచేసే బంట్రో తు కూడా ఇంతలా దిగజారి వ్యవహరించడన్నారు. మహిళల పట్ల సంస్కార హీనంగా మాట్లాడటం రాధాకృష్ణ నీచబుద్ధిని చాటుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టరు అంటేనే మహిళ లు తన్నే పరిస్థితులు వస్తాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు అన్ని వర్గాల ప్రజలు, మేధావుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ వైద్య కళాశాలల పరిస్థితే అమరావతికి వస్తుందనే అక్కసుతోనే జగనన్నపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచితంగా మాట్లాడారన్నారు. మరో 150 సంవత్సరాలు గడిచినా అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు కూడా అమరావతి రాజధానికి వ్యతి రేకం కాదని, ఆ పేరుతో రూ.వేల కోట్ల దోపీడీని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశాడన్నారు. ఇప్పటికైనా రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు.


