ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు | - | Sakshi
Sakshi News home page

ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

నంద్యాల(అర్బన్‌): కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఆదివారం జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఈత పోటీల్లో నంద్యాల వాసి కాశీపురం ప్రభాకర్‌రెడ్డి నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. జగ్గయ్య పేట మున్సిపాలిటీ సౌజన్యంతో డ్రిమర్స్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 50 ప్లస్‌ మాస్టర్స్‌ కేటగిరిలో 25 మీటర్ల ఫ్రీ స్టైల్‌, 25 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌, 50 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాల్లో ప్రభాకర్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండు రాష్ట్రాల్లోని 29 జిల్లాల నుంచి 300 మందికి పైగా స్విమ్మర్లు పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన నాలుగు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రొఫెషనల్‌ స్విమ్మింగ్‌ పూల్‌ లేకపోయినా కేసీ కెనాల్‌లో ప్రాక్టీస్‌ చేసి పోటీల్లో సత్తా చాటారు.

వివాదాస్పద స్థలం పరిశీలన

ఉయ్యాలవాడ: పెద్దయమ్మనూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణకు కారణమైన వివాదాస్పద స్థలాన్ని ఆదివారం అధికారులు పరిశీలించారు. గ్రామంలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం సంబంధించి జెడ్పీటీసీ సభ్యురాలు పుణ్య లక్ష్మీదేవి, గ్రామ మాజీ సర్పంచ్‌ కసాని నారాయణమ్మ సొంత స్థలంలో వేయడంతో టీడీపీ వర్గీయులు మహిళా ప్రజా ప్రతినిధులపై శనివారం దాడి చేసిన విషయం విధితమే. ఈ మేరకు తహసీల్దార్‌ ప్రసాద్‌బాబు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఆళ్లగడ్డ టౌన్‌ సిఐ యుగంధర్‌బాబు, స్థానిక ఎస్‌ఐ రామిరెడ్డి పెద్దయమ్మనూరు గ్రామానికి చేరుకుని స్థలం వివాదానికి సంబంధించిన డాక్‌మెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులతో స్థలం వివాదానికి సంబందించి ఆన్‌లైన్‌లో పరిశీలన చేసి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అంత వరకు ఇరువర్గాల వారు ఎలాంటి ఘర్షణలకు పాల్పడరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement