భజేహం..వాయుపుత్రం | - | Sakshi
Sakshi News home page

భజేహం..వాయుపుత్రం

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

రేపు శ్రీశైల భ్రామరీకి కుంభోత్సవం

దేవనకొండ: మండలంలోని బంటుపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ‘భజేహం..వాయుపుత్రం’ అంటూ గ్రామంలోని పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం అనంతరం నిర్వహించిన కుందేలు పార్వేట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

కల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ కార్యక్రమం ఏప్రిల్‌ 5 నుంచి 14వ తేదీ (బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి) వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కల్లూరు మండలం ఎ.గోకులపాడులో పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూర్య ఘర్‌ పథకం, రాష్ట్ర ప్రభుత్వ యూఎల్‌ఏ మోడల్‌ ద్వారా పెద్ద ఎత్తున సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 23,077 గృహాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ కిట్లు మంజూరయ్యాయన్నారు. డివిజన్ల వారిగా గుత్తేదారులను నియమించి మొదటి దశలో సుమారు 6 వేల గృహాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కర్నూలు టౌన్‌ ఈఈ శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

శ్రీశైలంటెంపుల్‌: లోక కల్యాణం కోసం శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు. మంగళవారం ఉదయం పూజల అనంతరం అమ్మవారి ఆల యం ముందు రజకునిచే ముగ్గు వేయించి, భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకా యలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్వికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేపడుతారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తాడు. అనంతరం రెండోవిడత సాత్వికబలిని సమర్పిస్తారు. తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement