కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్‌సీపీలో నాయకులు, కార్యర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, వారికి కొన్ని పదవులు ఇచ్చారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌రెడ్డి తెలిపారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే పదవులు పొంది వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సంబంధిత నాయకుల మొబైల్ నంబర్లకు లింకులు వెళ్లాయని, వారు దానిని క్లిక్ చేస్తే వివరాలు వస్తాయన్నారు. అందులో పేరు, ఫొటో తదితర వివరాలను సరిచూసుకొని ఆమోదం తెలిపితే కార్డులను ప్రింట్‌కు పంపుతామన్నారు. ఫోన్ నంబర్ తప్పుగా ఉంటే లింక్ రాదని, అ లాంటి వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించి సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


