● రూ. 15 లక్షల విలువైన బంగారు,
వెండి నగదు స్వాధీనం
నంద్యాల: జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ వివరాలు వెల్లడించారు. నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన షేక్ బాబావలీ నంద్యాల తాలూకా, బండిఆత్మకూరు, రేవనూరు, సంజామల, గడివేముల, బేతంచెర్ల, అవుకు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శుక్రవారం నందమూరి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్‌లేని బైక్‌పై వస్తున్న బాబావలీ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 98 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.54,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని అరెస్ట్‌లో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ సురేష్ కుమార్‌తోపాటు నంద్యాల తాలూకా సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ మందాజావళి, ఎస్పీ అభినందించారు.
దొంగ అరెస్ట్ చూపుతున్న ఎస్పీ సునీల్ షెరాన్
స్వాధీనం చేసుకున్న పోలీసులు


