శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంను బుధవారం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. డ్యాం వ్యూ పాయింట్ సమావేశ మందిరంలో శ్రీశైలం డ్యాం ఇంజినీర్లతో సేఫ్టీ బృందం సమావేశమైంది. శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజినీర్ కబీర్‌బాషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీశైలం డ్యాం స్థితి గతులను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో డ్యాం పటిష్టతపై పరిశీలన చేట్టారు. రెండు రోజులపాటు జరిగే పరిశీలనలో డ్యాం పునాదులు, బ్లాక్‌లు, రేడియల్, స్లూయిస్ గేట్లు, పునాది భాగం ముందున్న సిలిండర్లు, ఫ్ల్లంజ్‌పూల్ ప్రాంతాల పటిష్టతపై పరిశీలన చేస్తారు. డ్యాంకు ఇరువైపులా ఉన్న కొండగట్ల పటిష్టతకు షార్ట్ క్రీటింగ్ ప్రక్రియలపై తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ధిక రుణం అందజేసే ప్రపంచబ్యాంక్‌కు అందజేస్తారు. డ్యాంను పరిశీలించిన సేఫ్టీ బృందంలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలవనరుల శాఖ, ఎన్‌డీఎస్‌ఏలకు చెందిన నిపుణులు, చైర్మన్ డీకే శర్మ, హైడ్రో మెకానికల్ నిపుణులు గుల్షన్‌రాజ్, డ్యాం ఎక్స్‌పర్ట్ టీకే శివరాజన్, భూగర్భ నిపుణులు జేఎం గౌతంతో పాటు డ్యాం ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఇంజినీర్లు తదితరులు ఉన్నారు.


