వాహనాల వేలంతో రూ.10 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వాహనాల వేలంతో రూ.10 లక్షల ఆదాయం

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

కర్నూలు: ఎక్సైజ్‌ నేరా ల్లో పట్టుబడిన వాహనాలను స్థానిక కార్యాలయంలో అధికారు లు వేలం వేశారు. కర్నూలు ఎౖక్సైజ్‌ స్టేషన్‌ సీఐ చంద్రహాస్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 50 మంది పోటీదారులు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 57 వాహనాలకు గాను 53 వాహనాలను పోటీదారులు వేలంలో దక్కించుకున్నారు. మొత్తం విలువ రూ.6.73 లక్షలకు గాను రూ.8.70 లక్షలు ఆదాయం సమకూరింది. అదనంగా జీఎస్టీ రూ.1,57,500 కలిపి మొత్తం రూ.10,32,500 మొత్తాన్ని పాటాదారుల నుంచి అధికారులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లించారు. వేలం ప్రక్రియలో నిర్ణయించిన ధర కంటే 30 శాతం పెరుగుదల వచ్చినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement