శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు

Mar 22 2026 2:00 AM | Updated on Mar 22 2026 2:00 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్‌ ను సెల్‌ ఫోన్‌లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం.

పది గడ్డివాములు దగ్ధం

హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్‌లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్‌ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు.

మద్దిలేటయ్యలో

భక్తుల రద్దీ

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్‌ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

రేపు ప్రజా ఫిర్యాదుల

పరిష్కార వేదిక

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement