అల్లాహు అక్బర్‌ | - | Sakshi
Sakshi News home page

అల్లాహు అక్బర్‌

Mar 22 2026 1:34 AM | Updated on Mar 22 2026 1:34 AM

కర్నూలు సంతోష్‌నగర్‌ ఈద్గాలో నమాజ్‌ చేస్తున్న ముస్లింలు

రంజాన్‌ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ‘అల్లాహు అక్బర్‌... లా ఇలాహ్‌ ఇల్లల్లా’ అంటూ తక్బీర్‌ చదువుకుంటూ ఈద్గాలకు చేరుకున్నారు. ఈద్గాలకు వెళ్లలేని వారు మసీదులకు వెళ్లి నమాజ్‌ చేశారు. ఈద్గా, మసీదుల్లో నమాజ్‌ చేయించిన ఖాజీలు, మౌల్వీల ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేశారు. సర్వ మానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్‌ను వేడుకున్నారు. నమాజ్‌, దువా అనంతరం ఒకరినొకరు ఈద్‌ ముబారక్‌ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం పండుగ రావడంతో శుభాలు జరగాలని కోరుకున్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం మున్ముందు కొనసాగించాలని మతపెద్దలు సూచించారు. ిముస్లింలు, హిందువులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

దువా చేస్తున్న యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement