పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. నూతన భవనాలు, విశాలమైన తరగతి గదులు, మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభ కనబరిస్తే సీటు దక్కుతుంది.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల


