పదవ తరగతి విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పదవ తరగతి విద్యార్థి దుర్మరణం

Mar 21 2026 5:22 AM | Updated on Mar 21 2026 5:22 AM

కోవెలకుంట్ల:కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మల్లి కార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె మండలం రామతీర్థంకు చెందిన లాజరయ్య కు ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్ద కుమారుడు కిషోర్‌ (16) బనగానపల్లెలో మోడల్‌ స్కూల్‌లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నాడు. బంధువుల ఇంటి నుంచి బియ్యం ప్యాకెట్ల తీసుకెళ్లేందుకు వచ్చి ట్రాక్టర్‌ ఇంజిన్‌పై కూ ర్చొని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని జ్యోతి స్కూల్‌ సమీపంలో ప్రమాదశాత్తు ఇంజిన్‌పై నుంచి జారి కింద పడటంతో ట్రాలీ టైర్‌ ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement