వైభవంగా రాయబార మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రాయబార మహోత్సవం

Mar 22 2026 1:34 AM | Updated on Mar 22 2026 1:34 AM

బనగానపల్లె రూరల్‌: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. జిల్లెల గ్రామరస్తాలో ఉన్న అమ్మవారి పొలిమేర కుంట వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

రాయబార మహోత్సవంలో పాల్గొన్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement