హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్‌ | - | Sakshi
Sakshi News home page

హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్‌

Mar 22 2026 2:00 AM | Updated on Mar 22 2026 2:00 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

పాణ్యం: రాష్ట్రంలో గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడటం చంద్రబాబు విజన్‌కు అద్దం పడుతుందోని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలే అజెండాగా పని చేస్తున్నారని విమర్శించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రెండేళ్లగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్ర బాబు కనీసం స్పందించండం లేదన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు దోచుకోవడం, వారు అభివృద్ధి చెందడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు.

స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి పోరాటం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. గత ఖరీఫ్‌లో ప్రారంభమైన యురియా సమస్య నేటికీ తీర లేదన్నారు. ఇప్పటికీ రైతులు యురియాను బ్లాక్‌లో కొంటున్నారంటే దానికి చంద్రబాబు విజనే కారణమన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చేప్పుకునే చంద్రబాబు ఎక్కడ ఇచ్చారో అధికారికంగా విడుదల చేయాలన్నారు. కేవలం అనుబంధ సంస్థలకు, బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టి రాస్ట్రాలన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు తప్ప టీడీపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ సుబ్బరాయుడు, కో–ఆప్షన్‌ సభ్యులు జాకీర్‌ ఉసేన్‌, కృష్ణారెడ్డి, వైఎస్సాపీపీ రాష్ట ప్రచార వింగ్‌ సెక్రటరీ బాబు, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు వెల్డింగ్‌ చాంద్‌, పిన్నాపురం సర్పంచ్‌ ఎల్లకృష్ణయ్య, నాయకులు బాబి, మున్నా, స్వామి, ఎల్లగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement